Power House: క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ కాదు... ఆ ఒక్కటీ సీక్రెట్ - విక్రమ్ 'పవర్ హౌస్' గ్లింప్స్ చూశారా?

1 hour ago

చియాన్ విక్రమ్ హీరోగా రూపొందుతున్న 63వ చిత్రానికి 'పవర్ హౌస్' టైటిల్ ఖరారు చేశారు. క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ నుంచి రౌడీలను కుమ్మే పవర్ ఫుల్ పర్సన్ వరకు... విక్రమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ బావుంది.

తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు... విలక్షణ నటనతో తెలుగులోనూ  ఫ్యాన్స్ సొంతం చేసుకున్న హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఆయన సినిమా అంటే సంథింగ్ స్పెషల్ స్టోరీ ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ సినిమా టైటిల్ గ్లింప్స్ చూస్తే... మరోసారి అది అర్థం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. చియాన్ విక్రమ్ హీరోగా రూపొందుతున్న ఆయన 63వ సినిమాకు 'పవర్ హౌస్' (Power House) టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదల చేశారు. అది చూస్తే...

క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ కాదు... అది సీక్రెట్!
విక్రమ్‌తో 'ఇరు ముగన్' వంటి హిట్ తీసిన ఆనంద్ శంకర్, ఈ 'పవర్ హౌస్'కు దర్శకుడు. సత్య జ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. టైటిల్ గ్లింప్స్ చూస్తే... సుమారు మూడున్నర నిమిషాలు ఉంది.
పవర్ హౌస్' టైటిల్ గ్లింప్స్‌లో పెళ్లిళ్ల క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్‌గా విక్రమ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కుమార్తె పాత్రలో 'సర్వం మాయ'తో పాపులరైన రియా షిబు కనిపించారు. విజువల్స్ మొదలైన కాసేపటి వరకు బిజినెస్ వ్యవహారాలు, అందులో ఫ్యామిలీ సీన్స్ చూపించారు. అయితే స్టోరేజ్ యూనిట్ వైపు విక్రమ్ వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ బయట పడింది. అక్కడ ఇద్దర్ని కొట్టేసి కట్టేసినట్టు అర్థం అవుతోంది. వాళ్ళ బాడీ నుంచి వచ్చిన బ్లడ్ క్లీన్ చేసే పనిలో విక్రమ్ పడతారు. అసలు ఆ ఇద్దరూ ఎవరు? వాళ్ళను ఎందుకు కట్టేశారు? క్యాటరింగ్ బిజినెస్ కాకుండా విక్రమ్ ఇంకేం చేస్తారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
సీనియర్ నటి ఊర్వశి, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది (2027లో) థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. ఇది కాకుండా దర్శకుడు విష్ణు ఎడవన్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, అలాగే '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు విక్రమ్.

Click here to Read More
Previous Article
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
Next Article
Surya Tej: రచయితగా మారిన సూర్య తేజ్... 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' తర్వాత నితిన్ గడ్కరీపై!?

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment