AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

1 hour ago

AP Police Recruitment: ఏపీలో పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఏపీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ ఇచ్చింది.

AP Police Recruitment: ఏపీలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. మంగళవారం 892 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. తాజాగా బుధవారం 2050 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) ద్వారా  ప్రకటన విడుదల చేసింది. పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం 438 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో సివిల్‌ విభాగంలో 253, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 116, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌‌లో 9, కమ్యూనికేషన్స్‌‌లో 50, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో 10 పోస్టులు ఉన్నాయి. 

1,156 కానిస్టేబుల్ ఉద్యోగాలు

అలాగే 1,156 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, ఫైర్‌, జైళ్ల విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పోలీస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో 200 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్లు, మెకానిక్‌ ఉద్యోగాలు ఉన్నాయి. పీటీవో విభాగంలో 15 మెకానిక్స్‌, 198 డ్రైవర్‌, 43 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి త్వరలో రాత పరీక్ష తేదీల వివరాలను ప్రకటించనున్నారు. 

పోస్టుల వివరాలు ఇలా

  • ఎస్ఐ (SPF) - 9
  • ఎస్ఐ (కమ్యూనికేషన్) - 50
  • ఎస్ఐ (PTO) - 10
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ - 43
  • పీసీ (సివిల్/ఏఆర్) - 827
  • ఫైర్‌మెన్‌- 158
  • వార్డర్ - 171
  • పీసీ (కమ్యూనికేషన్) - 200
  • పీసీ (మెకానిక్స్‌, డ్రైవర్లు) - 213

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్ విధానం, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను APSLPRB ప్రకటించనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ విధానం, దరఖాస్తు తేదీలను పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోవచ్చు. 

Click here to Read More
Previous Article
Fauzi Release Update: జనవరి బరిలో ప్రభాస్ 'ఫౌజీ'? సంక్రాంతి సినిమాలకు టెన్షన్?
Next Article
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?

Related జాబ్స్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment