రైతులకు PM-Kisan 24వ విడత — రూ.2,000 జమ

2 weeks ago

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా అర్హులైన రైతులకు 24వ విడత నిధులు అక్టోబర్‌ 30న విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో సుమారు 9.34 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున అందే అవకాశం ఉంది.

ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం మూడు విడతలుగా అందిస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు కొంత ఆర్థిక మద్దతు అందించడం ఈ పథకం లక్ష్యం.

రైతులు తమ బ్యాంకు ఖాతా, ఆధార్‌ వివరాలు, e-KYC వంటి అంశాలను సరిచూసుకోవాలి. నిధులు జమయ్యాయా లేదా అనే వివరాలను అధికారిక PM-Kisan వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.